టాలీవుడ్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడిగా ‘నిఖిల్ కుమార స్వామి ‘ కర్ణాటక లో సుపరిచితమే. హీరో గా కూడా ఇప్పటికి మూడు సినిమాలు చేసాడు. నిఖిల్ హీరో గా నటించిన మొదటి సినిమా ‘జాగ్వార్’ తెలుగు లో కూడా విడుదల అయింది. మధ్యలో రెండు సినిమాలు వచ్చినప్పటికి అవి తెలుగు లో విడుదల చెయ్యలేదు. ఇపుడు నాల్గవ సినిమాగా ‘రైడర్’ అనే సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ విడుదల చేసారు. ఈ సినిమాని బహు బాషా చిత్రంగా ఎక్కువ భాషల్లో విడుదల చేస్తున్నారు.
‘గుండె జారీ గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ లాంటి లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ లు తీసిన విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకి దర్శకత్వం వహించడం ప్రత్యేకత గా చెప్పుకోవచ్చు. పోస్టర్ చూస్తుంటే మరొక యాక్షన్ స్టోరీ లాగా కనిపిస్తుంది కానీ దర్శకుడి పంథా కి తగ్గట్టు ఇది ఫామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. అర్జున్ జన్య ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. చంద్రు మనోహరన్ ఈ సినిమాని బారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.