జైపూర్: కేరళలో నిఫా వైరస్ కారణంగా ఒకరు మృతి కలకలం రేపిన నేపథ్యంలో రాజస్థాన్‌లో నిపా వైరస్ అలర్ట్ జారీ చేశారు. కేరళలో ఈ వైరస్ వల్ల ఒకరు మృతి చెందారని అధికారులు సోమవారం తెలిపారు.
ఆరోగ్య సంచాలకుడు డాక్టర్ రవి ప్రకాశ్ మాథూర్ ఒక ఆదేశాన్ని జారీ చేస్తూ, అన్ని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్, సీఎమ్హెచ్వో మరియు పిఎంవో లకు రోగులను సకాలంలో గుర్తించి వారి సమాచారాన్ని పంచాలని సూచించారు.
ఈ వైరస్ సోకిన రోగులు తీవ్రమైన తలనొప్పి మరియు జ్వరం అనే లక్షణాలతో వస్తారని, ఈ లక్షణాలు కాలక్రమేణా తీవ్రతరం కావచ్చు అని డాక్టర్లు తెలిపారు. ఈ వైరస్ కారణంగా మెదడు సంక్రమణ లేదా ఎన్సెఫలైటిస్ ప్రమాదం పెరగవచ్చు అని తెలిపారు.
కేరళ నుండి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, కేరళ నుండి వచ్చే పర్యాటకులను పర్యవేక్షించేందుకు హోటల్ ఆపరేటర్లను కూడా అప్రమత్తం చేశారు.