న్యూస్ డెస్క్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విభజన సమయంలో మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు.
కేంద్రం ఏ రాష్ట్రానికి వివక్ష చూపదని, బడ్జెట్‌లో తెలంగాణకు తగిన ప్రాధాన్యత కల్పించామని స్పష్టం చేశారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విపక్షాలు చేస్తున్న విమర్శలు అసత్యమని అన్నారు.
బీహార్ లేదా ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారన్నది వాస్తవం కాదని, తెలంగాణకు కూడా నిధులు అందించామని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అనేక ప్రాజెక్టులు ఇచ్చిందని చెప్పారు. ముఖ్యంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ కేంద్ర బడ్జెట్‌లో భాగమని తెలిపారు.
మెదక్ నుంచి గెలిచిన ఇందిరా గాంధీకి కూడా రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ తీసుకువచ్చారన్నారు.
రామగుండం ప్లాంట్, సమ్మక్క సారక్క ప్రాజెక్టులు, పసుపు బోర్డు వంటి ప్రాధాన్యత అంశాలు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన కృషిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.