మూవీడెస్క్: ఎల్లమ్మ కోసం నితిన్? దర్శకుడిగా బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు, తన తదుపరి ప్రాజెక్ట్‌గా ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని ప్రకటించాడు.
ఈ సినిమా కూడా దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనుంది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో గ్రామీణ కథాంశం ఉన్న ఈ సినిమా కోసం మొదట నానిని హీరోగా ఫిక్స్ చేశారు.
కానీ అనుకోని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో కొత్త హీరో కోసం వేణు సెకండ్ రౌండ్ కాస్టింగ్ చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలో నితిన్ పేరు ఫైనల్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. వేణు, కథను నితిన్‌కు వినిపించగా, ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపినట్లు సమాచారం.
నితిన్ ఇప్పటివరకు పూర్తిస్థాయి మాస్ పాత్రలో నటించకపోవడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
దిల్ రాజు బ్యానర్‌లో ఇప్పటికే నితిన్ ‘తమ్ముడు’ సినిమాతో పని చేస్తున్నందున, ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌కి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. 2025 ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాబిన్ హుడ్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు, ఇది డిసెంబర్ 20న విడుదల కానుంది.