fbpx
Wednesday, April 2, 2025
HomeMovie Newsనితిన్ 'మేస్ట్రో' ట్రైలర్

నితిన్ ‘మేస్ట్రో’ ట్రైలర్

Nithin Maestro Trailer

టాలీవుడ్: హిందీ లో ఆయుష్మాన్ ఖురానా హీరో గా రూపొందిన ‘అందాదున్ ‘ సినిమాని తెలుగులో ‘మేస్ట్రో’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు నితిన్. వేంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫేమ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ కి జోడీ గా నభ నటేష్ అలాగే మరో స్పెషల్ రోల్ లో తమన్నా భాటియా నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.

నితిన్ ఈ సినిమాలో ఒక దృష్టి లోపం ఉండే పాత్రలో నటిస్తున్నాడు. హిందీ సినిమా చూడని వారికీ ఈ సినిమా ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అసలు నిజంగానే కళ్ళు కనపడవా లేక నటిస్తున్నాడా అని భ్రమలో పడే సీన్స్ చాలా ఉంటాయి. నభ తో రొమాన్స్ అలాగే అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కునే సన్నివేశాల్లో నితిన్ కామెడీ తో పాటు సస్పెన్స్ కూడా జెనెరేట్ చేసాడు. నితిన్ నిజంగానే అంధుడా లేక నటిస్తున్నాడా లాంటి సీన్స్ కూడా ట్రైలర్ లో చాలా వరకే చూపించారు. సినిమాలో మరో నెగెటివ్ పాత్రలో జిషు సేన్ గుప్తా నటిస్తున్నారు.

ట్రైలర్ చూస్తే హిందీ లో ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ దించేసినట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి కొద్దీ రోజుల్లో హాట్ స్టార్ ఓటీటీ లో ఈ సినిమా విడుదల అవనుంది.

Maestro | Official Trailer | Nithiin, Tamannah Bhatia, Nabha Natesh, Jissu Sen Gupta | Coming Soon

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular