టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘చెక్’ మరొకటి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అందాదున్’ తెలుగు రీమేక్. ప్రస్తుతం ఈ మూడు సినిమాల్లో వెంకీ అట్లూరి తో చేస్తున్న’ రంగ్ దే’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దిశగా వెళ్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఒక చిన్న టీజర్ విడుదల చేసి ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు. 2021 సమ్మర్ లో మార్చ్ 26 న ఈ సినిమా విడుదల అవబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
‘రంగ్ దే’ సినిమాలో నితిన్ కి జోడీ గా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ, లవ్ మరియు ఫామిలీ ఎంటర్టైనర్ లాగా రూపొందింది.ఈ సినిమాకి సంబంధించి ఇదివరకే విడుదలైన టీజర్స్ ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికి విడుదలైన ఒక రొమాంటిక్ సాంగ్ హిట్ గా నిలిచింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పైన ‘సూర్య దేవర నాగ వంశీ’ ఈ సినిమా రూపొందిస్తున్నారు.