fbpx
Sunday, January 19, 2025
HomeMovie News'తిన్నావా' అంటూ నితిన్ స్నేహ చికెన్ యాడ్

‘తిన్నావా’ అంటూ నితిన్ స్నేహ చికెన్ యాడ్

Nithin SnehaChicken CommercialAdvertisement

టాలీవుడ్: ఇప్పుడున్న హీరోలు సినిమాలు చేసుకుంటూ రక రకాల మార్గాల్లో ఆదాయాలు కూడా పొందుతున్నారు. కొందరు బిసినెస్ లు చేస్తున్నారు, కొందరు సొంత బ్రాండ్స్ పెడుతున్నారు కొందరు బ్రాండ్ ఎండార్సుమెంట్స్ చేస్తున్నారు. ఇపుడు నితిన్ కూడా ఈ జాబితా లో చేరాడు. తన మొదటి కమర్షియల్ యాడ్ స్నేహ చికెన్ కి చేసాడు. ఇదివరకు ‘తిన్నావా’ అంటూ విడుదల చేసిన నితిన్ ఫోటో షూట్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇపుడు ఆ యాడ్ కి సంబందించిన వీడియో కూడా విడుదల చేసారు. ఇందులో నితిన్ తో పాటు తల్లి గా ‘ప్రగతి’ చేసారు.

‘స్నేహ చికెన్ – ది చికెన్ ఆంథమ్‘ అనే పేరుతో ఈ వీడియో విడుదల చేసారు. ‘ఈ అమ్మలెప్పుడు ఇంతేనండి. మనం ఎక్కడున్నా ఏంచేస్తున్నా ఒకటే ప్రశ్న.. ‘తిన్నావా?’ అని. ఆ ప్రశ్నకు స్నేహ ఫ్రెష్ చికెన్ బదులైతే ప్రతి అమ్మకి ఇక పండగే’ అని నితిన్ ప్రమోట్ చేస్తున్నాడు.ఇది నితిన్ కి మొట్టమొదటి కార్పొరేట్ బ్రాండ్ ఎండార్స్మెంట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular