టాలీవుడ్: హిందీ లో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ‘అందాదున్’. ఈ సినిమాని తెలుగు లో రీ-మేక్ చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో నితిన్ నటిస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ , ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలని రూపొందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది. తన 30 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్ కి జోడీ గా హిందీ లో రాధికా ఆప్టే చేసిన పాత్రలో నభ నటేష్ నటిస్తుంది. అలాగే హిందీ లో టబు చేసిన ఆంటీ పాత్రలో తమన్నా నటిస్తుంది. ఇందులో హెబ్బా పటేల్ కూడా మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు.
ఈ సినిమా షూట్ మొదలు అయినట్టు ఒక ఫోటో కూడా షేర్ చేసారు. నితిన్ పియానో వాయిస్తున్నట్టు ఒక పోస్టర్ విడుదల చేసారు. హిందీ సినిమా చూసిన వారికి ఆ సీన్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఈ సినిమా కూడా ఆ సీన్ నుండే ప్రొమోషన్ మొదలుపెట్టారు. ఈ సినిమాని నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పైన ఎన్ సుధాకర్ రెడ్డి,నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. భీష్మ కి సంగీతం అందించి నితిన్ కి మ్యూజికల్ హిట్ ఇచ్చిన సాగర్ మహతి ఈ సినిమాకి కూడా సంగీతం అందించబోతున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వం లో ‘రంగ్ దే’ సినిమాని మరియు చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘చెక్’ అనే సినిమాలని చేస్తున్న నితిన్ ఈ సినిమా కూడా షూటింగ్ మొదలు పెట్టాడు. ఈ సినిమా కూడా పూర్తి చేసి వచ్చే సంవత్సరం తన నుండి మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.