fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsనితిన్ మరో న్యూ కాంబినేషన్.. డైరెక్టర్ ఎవరంటే..

నితిన్ మరో న్యూ కాంబినేషన్.. డైరెక్టర్ ఎవరంటే..

NITHIN-TO-ACT-UNDER-NEW-DIRECTOR
NITHIN-TO-ACT-UNDER-NEW-DIRECTOR

మూవీడెస్క్:యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకి కుడుముల దర్శకత్వంలో “రాబిన్ హుడ్” చిత్రంలో నటిస్తున్నారు.

డిసెంబర్ 20న విడుదలకానున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందుతుంది. ఈ సినిమా తరువాత, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “తమ్ముడు” అనే చిత్రం చేస్తున్నాడు.

దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, 2025 ప్రారంభంలో విడుదల కానుంది. అలాగే “బలగం” చిత్రంతో దర్శకుడిగా సూపర్ సక్సెస్ సాధించిన కమెడియన్ వేణు, తన రెండో ప్రాజెక్ట్ కోసం నితిన్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారని సమాచారం.

మొదట, నాని తో ఈ ప్రాజెక్ట్ జరగాలనే ఆశతో వేణు కలిశారు, కానీ నాని ఇటీవల బిజీ ప్రాజెక్టుల కారణంగా డేట్స్ అందుబాటులో లేకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ రద్దు అయింది.

తర్వాత, విశ్వక్ సేన్ తో ఈ ప్రాజెక్ట్ అనుకున్నారని టాక్ వచ్చింది. కానీ విశ్వక్ సేన్ కూడా తన ముందుగా ప్లాన్ చేసిన సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో తమ్ముడు సినిమా పూర్తి అయిన తర్వాత వేణు, నితిన్‌తో సినిమా చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మించవచ్చని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular