fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsక్లాసికల్ సింగర్ గా నిత్య మీనన్

క్లాసికల్ సింగర్ గా నిత్య మీనన్

NithyaMenon AsClassicalSingerIn Gamanam

టాలీవుడ్: శ్రియ శరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గమనం’. ఈ మధ్యనే శ్రియ పుట్టిన రోజు సందర్భంగా శ్రియ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమాలో నిత్య మీనన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈరోజు నిత్య మీనన్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు సినిమా టీం. ఈ సినిమాలో నిత్య మీనన్ ఒక క్లాసికల్ సింగర్ గా నటిస్తుంది. ‘శైల పుత్రి దేవి’ అనే పాత్రలో నటిస్తున్న నిత్య మీనన్ ఫస్ట్ లుక్ ని శర్వానంద్ విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో నిత్య ప్రత్యేకంగా సాంప్రదాయమైన వస్త్రధారణలో సంగీత కచేరి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాత అవతారం ఎత్తి రమేష్ కరుటూరి – వెంకీ పుషడపు లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సుజనా రావు అనే దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకు మాటలు రాస్తున్నారు. ఈ సినిమాలో శ్రియ, నిత్య మీనన్ తో పాటు రాజ్ కందుకూరి కుమారుడు ‘శివ కందుకూరి’ అలాగే టాక్సీవాలా ఫేమ్ ‘ప్రియాంక జవల్కర్’ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, మలయాళం,కన్నడ, హిందీ భాషల్లో విడుదల అవబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular