మూవీడెస్క్: టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన హీరోలలో నితిన్ ఒకరు.
మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ అవ్వడంతో, నితిన్ అభిమానులు ఆయన నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
అందులో భాగంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ పైన భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ మూవీని డిసెంబర్ 20న విడుదల చేయాలని తొలుత ప్లాన్ చేశారు. కానీ పుష్ప 2 బజ్ ప్రభావం ఉంటుందనే భయంతో వాయిదా వేశారు.
అయితే క్రిస్మస్ విడుదలలలో పుష్ప 2 కలెక్షన్లు తగ్గిపోయి, ప్రేక్షకులు కొత్త చిత్రాల కోసం ఎదురుచూస్తున్న సందర్భంలో రాబిన్ హుడ్ విడుదలై ఉంటే, గట్టి హిట్ కొట్టేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
క్రిస్మస్ కానుకగా వచ్చిన బచ్చలమల్లి, విడుదల 2, యూఐ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఈ సమయంలో రాబిన్ హుడ్ విడుదలై ఉంటే, నితిన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడేది. కానీ మేకర్స్ ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల నటించగా, అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
మరి ఫిబ్రవరి విడుదల నితిన్‌కి ఎంతవరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.