మూవీడెస్క్: యువ హీరో నితిన్ రెండు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే, ఇప్పుడు అతనికి విడుదల తేదీల విషయంలో పెద్ద సమస్య ఎదురైంది.
వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మార్చి 28న విడుదల కానుందని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కానీ అదే రోజున పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా థియేటర్లలోకి రావడం ఖాయం అన్న ప్రచారం ఉంది.
ఒకవేళ పవన్ సినిమా నిజంగానే వస్తే, నితిన్ వెనక్కి తగ్గడం తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పవన్ వీరాభిమాని అయిన నితిన్, ఆ పోటీకి దిగేందుకు సిద్ధంగా లేడని, మైత్రి మూవీ మేకర్స్ కూడా అనవసరమైన రిస్క్ చేయబోరని అంటున్నారు.
ఇక మరోవైపు, దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమ్ముడు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
మొదట శివరాత్రి విడుదలగా ప్లాన్ చేసినా, ఇప్పుడు వేసవికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
నితిన్ మార్కెట్ దృష్ట్యా రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల మధ్య కనీసం రెండు నెలల గ్యాప్ ఉండాలి.
కానీ ప్రస్తుతం ఈ సినిమాల విడుదల తేదీలు క్లియర్ కాకపోవడం కాస్త గందరగోళాన్ని కలిగిస్తోంది.
ఒకవేళ రాబిన్ హుడ్ ముందుగా అనుకున్నట్లుగా డిసెంబర్‌లో విడుదలై ఉంటే, ఇప్పుడు తమ్ముడుకి స్పష్టమైన మార్గం ఉండేది.
కానీ డిలే కావడం వల్ల ఈ సమస్య తలెత్తింది.
ఇప్పట్లో హరిహర వీరమల్లు విడుదలపై స్పష్టత వచ్చే వరకు రాబిన్ హుడ్ జట్టుకు ఇదే ప్రధాన టెన్షన్.
నితిన్ ఈ రెండు చిత్రాలతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
అయితే అనుకోకుండా వచ్చిన ఈ క్లాష్ సమస్యకు ఏం పరిష్కారం కనుగొంటారో చూడాలి.