హైదరాబాద్: ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇది గొప్ప శుభవార్త. గాయంతో చాంపియన్స్ ట్రోఫీని మిస్ అయిన తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి పూర్తి ఫిట్‌నెస్ సాధించి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల యోయో టెస్ట్‌లో 18 స్కోరు సాధించి ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.
గత ఐపీఎల్‌లో నితీశ్ 13 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేయడంతో పాటు, మూడు వికెట్లు కూడా సాధించాడు. ఆల్‌రౌండర్‌గా అతడి ప్రదర్శన జట్టుకు ఎంతో సహాయపడింది. సన్‌రైజర్స్ ఫైనల్‌కి చేరడంలో అతని కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రీ-టోర్నమెంట్ క్యాంప్‌లో నేడు అతను జాయిన్ కానున్నాడు.
25 ఏళ్ల నితీశ్, 2023లో బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 8వ నంబర్‌లో బ్యాటింగ్ చేసి సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఈసారి ఐపీఎల్‌లో నితీశ్ రాకతో సన్‌రైజర్స్ జట్టు మరింత బలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అతడి ప్రదర్శనపై పెద్ద ఆశలు ఉన్నాయి. కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలో ఎస్ఆర్‌హెచ్ ఈసారి టైటిల్ గెలవగలదా? అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.