fbpx
Saturday, January 11, 2025
HomeAndhra Pradeshనివర్ తుఫాన్: తెలుగు రాష్ట్రాల కంట్రోల్ నంబర్లు

నివర్ తుఫాన్: తెలుగు రాష్ట్రాల కంట్రోల్ నంబర్లు

NIVAR-CYCLONE-CONTROL-NUMBERS-AP

కడప/హైదరాబాద్: నివర్ తుపాను తీవ్ర ప్రభావం చూపనున్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ సి హరికిరణ్ ప్రజలకు సూచించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తుపాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించినట్టు ఆయన తెలిపారు.

వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాలు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, అవసరమైన ఇసుక బ్యాగ్స్ ను అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. నివర్ తుఫాన్ కారణంగా రేపు (గురువారం) జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు దినంగా ప్రకటించిన డీఈఓ శైలజ.

కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోల్ రూమ్ : 08562 – 245259
సబ్ కలెక్టర్ కార్యాలయం, కడప : 08562 – 295990, 93814 96364, 99899 72600
సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజంపేట : 08565 – 240066, 93816 81866
ఆర్డీవో కార్యాలయం, జమ్మలమడుగు : 96766 08282, 08560- 271088

దక్షిణమధ్య రైల్వే హెల్ప్‌లైన్లు
నివర్‌ తుపాను నేపథ్యంలో రైల్‌ సర్వీసుల్లో మార్పులుండే అవకాశం ఉందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. తుపాను ప్రభావం చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకా వైపు వెళ్లే రైళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రయాణికుల సమాచారం మేరకు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ప్రయాణికులు సహాయం కోసం ఈ కింది నంబర్లలో సంప్రదించవచ్చు.

సికింద్రాబాద్‌: 040-27833099
విజయవాడ: 0866-2767239
గుంటూరు: 0863-2266138
గుంతకల్లు: 7815915608

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular