ట్విట్టర్: ప్రస్తుతం భారత సినీ ఇండస్ట్రీ చూపు మలయాళం సినిమా ఇండస్ట్రీ పైన కూడా ఎక్కువగానే ఫోకస్ పెడుతుంది. టెక్నిషన్స్ పరంగా అయినా కానీ, కథా పరంగా అయినా కానీ ప్రస్తుతం మలయాళం సినీ ఇండస్ట్రీ దాదాపు టాప్ పోసిషన్ లో ఉంది. ఇప్పటికిప్పుడు దాదాపు 10 మలయాళం సినిమాలు తెలుగు లో రీమేక్ అవడం కోసం సిద్ధంగా ఉన్నాయి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మలయాళం సినిమాల్లో స్టోరీ నే హీరో, అలాంటి స్టోరీల్లోంచి కూడా కొందరు హీరోలు తమ నటన తో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. అలాంటి వాళ్లలో నివిన్ పౌలీ ఒకరు. దాదాపు 5 సంవత్సరాల క్రితం ఒక చిన్న సినిమాగా విడుదల అయ్యి దేశ వ్యాప్తంగా ‘ప్రేమమ్’ సినిమా కి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో నటించిన నివిన్ పౌలీ కి కూడా దేశ వ్యాప్త గుర్తింపు వచ్చింది.
ప్రస్తుతం నివిన్ పౌలీ తాను ఇండస్ట్రీ కి వచ్చి 10 సంవత్సరాలని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భం గా తాను నటిస్తున్న తదుపరి సినిమా ‘పడవెట్టు’ ఫస్ట్ లుక్ విడుదల చేసాడు. ‘సమస్య, పోరాటం, జీవనం మనుషులున్నంత వారికి ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అని తన ఫస్ట్ లుక్ రివీల్ చేశారు హీరో నివిన్ పౌలీ. ఈ సినిమాని సన్నీ వేన్ ప్రొడక్షన్స్ పైన లీజు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నివిన్ పౌలీ తో పాటు మంజు వారియర్(అసురన్ ఫేమ్) , అదితి బాలన్ (అరువి ఫేమ్) నటిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ్ 96 సినిమాకి అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేసిన గోవింద్ వసంత్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు.
malayalam directors telugu lo ki ravali. denni kuda remake chestaru inka manollu. 😀