హైదరాబాద్: తెలంగాణ లో నో వ్యాక్సిన్-నో రేషన్ అని ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఉచితంగా టీకా వేస్తుంది. అయినా కూడా కొందరు మాత్రం వ్యాక్యిన్ వేసుకోవడం లేదు.
ఈ తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో గద్వాల్ కలెక్టర్ చేసిన ఒక ట్వీట్ తెగ వైరలయ్యింది. దాని సారాంశం ఏమిటంటే తెలంగాణలో వ్యాక్సిన్ వేయించుకోని వారికి రేషన్ కార్డులు, పెన్షన్ కట్ చేస్తారు అన్ని. అలాగే దీనికి తగ్గట్టుగానే వైద్య, ఆరోగ్య శాఖ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకోని వారికి రేషన్ మరియు పెన్షన్ నిలిపేస్తామంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు.
ఈ విహ్దానం వచ్చే నెల నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. అయితే దీని గురించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఈ పుకార్లపై స్పందించింది.
కాగా ఈ వార్తలన్నీ తప్పుడు వార్తలని ఖండించింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిలో నో వ్యాక్సిన్-నో రేషన్ అనతేది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేసింది. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు అని కోరింది. మరి హెల్త్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు నమ్మాలా, లేక ఇప్పుడు తాజాగా వెలువడినా ప్రకటనను నమ్మాలా తెలియని సందిగ్ధంలో ఉన్నారు తెలంగాణ ప్రజలు.