సాక్షి: డిసెంబర్ నెల రెండో వారం లేదా మూడో వారంలో నోకియా నుంచి లేటెస్ట్ స్మార్ ఫోన్ 3.4 భారత దేశ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్‌ను కొన్ని ఎంపిక చేసిన యూరోపియన్ దేశాలలో సెప్టెంబర్‌లోనే నోకియా విజయవంతంగా ప్రవేశపెట్టింది. యూకేలో 3.4 నోకియా ఫోన్ ధర 130 పౌండ్లుకాగాం దేశీయంగా సుమారు రూ. 12,000- 12,800 స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకుల అంచనా.
నోకియా కంపెనీ స్మార్ట్ ఫోన్లలో 2.4 మోడల్, 5.3 మోడళ్ల ధరలు రూ. 10,400- రూ. 12,999 మధ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మోడళ్ల మధ్యలో తాజా ఫోన్ 3.4 ధర ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
నోకియా దేశీ వెబ్‌సైట్ వివరాల ప్రకారం నోకియా 3.4 మోడల్ మూడు కలర్స్‌లో విడుదల అవుతాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 406 ఎస్‌వోసీ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 64 జీబీ వరకూ అంతర్గత మెమరీను అందించనుంది. మైక్రో ఎస్‌డీకార్డ్ ద్వారా 512 జీబీ వరకూ మెమరీను పెంచుకునే సౌలభ్యం కూడా కల్పిస్తోంది.
నోకియా 3.4 ఫోన్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగిన 6.39 అంగుళాల తెరతో వెలువడనుంది. డ్యూయల్ నానో సిమ్ కార్డ్స్ సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో మూడు కెమరాలు ఉంటాయి. 13 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ డెప్త్ సెన్సర్, 5 ఎంపీ అల్ట్రావైడ్‌తో వీటిని ఏర్పాటు చేసింది.