న్యూఢిల్లీ : ఒకప్పుడు ఈ మొబైల్ బ్రాండ్ అంటే అందరికీ ఎంతో క్రేజ్, కానీ ఇప్పుడూ అక్కడక్కడ తప్పితే ఎక్కువగా కనిపించదు. కానీ తిరిగి మార్కెట్ లోకి కొత్త ఫీచర్లతో వచ్చే ప్రయత్నం చేస్తున్న కంపెనీ నోకియా. తాజాగా నోకియా మొబైల్ ఫోన్‌ల తయారీదారు అయిన హెచ్ఎండీ గ్లోబల్ అందరికీ అందుబాటు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది.
నోకియా ఎక్స్ 20 పేరుతో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది 5జీ సపోర్ట్‌తో స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ను జోడించిన నోకియా ఎక్స్ 20 త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే గురువారం జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్, టాప్ లైన్‌లలో భాగంగా ఈ ఆరు మోడల్లను నోకియా తీసుకురావడం విశేషం.
ఈ నోకియా 5జీ ఎక్స్ 20 యొక్క ఆకర్షనీయమైన ఫీచర్లు:
6.67అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 11
1080క్ష్2400 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్
32 ఎంపీ సెల్ఫీకెమెరా
64 + 5+2+2 ఎంపీ క్వాడ్ కెమెరా
6 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్
4470 ఎంఏహెచ్ బ్యాటరీ
ప్రస్తుతం ఈయూ మార్కెట్లో దీని ధర సుమారు 31,000 రూపాయలు. మిడ్‌నైట్ సన్, నార్డిక్ బ్లూ రంగులలో అందుబాటులోకి వస్తుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో మేలో సేల్ ప్రారంభం అవనుంది.