హాలీవుడ్: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులు ఈరోజు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ జరిగేలా కాకుండా కోవిడ్ కారణంగా ఈ సారి రెండు ప్రదేశాల్లో జరిపారు. అంతే కాకుండా ఈ సారి రెండు నెలలు ఆలస్యంగా నిర్వహించారు. 2020 మరియు 2021 మొదటి నెలల్లో విడుదలైన సినిమాలని నామినేషన్లలో స్వీకరించారు. ఈ రోజు ఈ అవార్డు గ్రహీతల్ని ప్రకటించి వాళ్ళకి అవార్డులు అందించారు.
ప్రతీ సారి ఎదో ఒక సినిమా ఎక్కువ అవార్డుల్ని పొంది హైలైట్ అవుతుంది. ఈ సారి ‘నో మాడ్ ల్యాండ్’ అనే సినిమా ఆ అవకాశాన్ని పొందింది. 10 కాటగిరీల్లో నామినేషన్ లో ఉన్న ఈ సినిమా ‘ఉత్తమ సినిమా’, ‘ఉత్తమ నటి’, ‘ఉత్తమ దర్శకుడి’ కేటగిరీల్లో అవార్డులు సంపాదించి ఉన్నత స్థానంలో నిలిచింది. ‘ది ఫాదర్’ అనే సినిమాలో ఆంథోనీ హాకిన్స్ కనపరచిన నటనకి ఉత్తమ నటుడి అవార్డు లభించింది.
ఇండియన్ సినిమా నుండి సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఆస్కార్ బరిలోకి వెళ్ళింది అనుకున్నా కానీ నిరాశే ఎదురైంది, నామినేషన్లలో తిరస్కరించారు. జుడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్య , ది ఫాదర్, మా రైనీస్ బ్లాక్ బాటమ్, మాంక్, సోల్, సౌండ్ అఫ్ మెటల్ సినిమాలకి రెండేసి కాటగిరీల్లో అవార్డులు లభించాయి.