అమరావతి: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ! ఎవరెవరికి ఏఏ పోస్టులు దక్కాయంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. 20కి పైగా కార్పొరేషన్లకు ఛైర్మన్లను తెలుగుదేశం పార్టీ (తెదేపా), జనసేన, భారతీయ జనతా పార్టీ (భాజపా) నేతలకు ప్రాధాన్యం కల్పిస్తూ నియమకాలు చేపట్టింది. ఆర్టీసీ ఛైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నియమితులయ్యారు. ఇక, వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్ అజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా లంకా దినకర్, శాప్ ఛైర్మన్‌గా రవి నాయుడులను ప్రభుత్వం నియమించింది.
నామినేటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ల వివరాలు:
- వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజీజ్ (తెదేపా)
- శాప్ – అనిమిని రవి నాయుడు (తెదేపా)
- గృహనిర్మాణ సంస్థ – బత్తుల తాతయ్యబాబు (తెదేపా)
- ఏపీ ట్రైకార్ – బొరగం శ్రీనివాసులు (తెదేపా)
- ఏపీ మారిటైం బోర్డు – దామచర్ల సత్య (తెదేపా)
- సీడాప్ – దీపక్‌రెడ్డి (తెదేపా)
- 20 సూత్రాల అమలు కమిటీ – లంకా దినకర్ (భాజపా)
- మార్క్‌ఫెడ్ – కర్రోతు బంగార్రాజు (తెదేపా)
- సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – మన్నె సుబ్బారెడ్డి (తెదేపా)
- ఏపీఐఐసీ – మంతెన రామరాజు (తెదేపా)
- పద్మశాలి కార్పొరేషన్ – నందం అబద్ధయ్య (తెదేపా)
- ఏపీటీడీసీ – నూకసాని బాలాజీ (తెదేపా)
- ఏపీఎస్ ఆర్టీసీ – కొనకళ్ల నారాయణ, వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం (తెదేపా)
- పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ – పీలా గోవింద సత్యనారాయణ (తెదేపా)
- లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ – పిల్లి మాణిక్యాల రావు (తెదేపా)
- వినియోగదారుల రక్షణ కౌన్సిల్ – పీతల సుజాత (తెదేపా)
- ఎంఎస్‌ఎంఈడీసీ – తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)
- పౌర సరఫరాల కార్పొరేషన్ – తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన)
- ఏపీటీపీసీ – వజ్జ బాబూరావు (తెదేపా)
- ఏపీ టిడ్కో – వేములపాటి అజయ్‌కుమార్ (జనసేన)
ఈ నియామకాల ద్వారా ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న ఆశావహుకులకు కొంతవరకు న్యాయం చేసినట్టే కనబడుతోంది.