అంతర్జాతీయం: ఉత్తర కొరియాలో సంచలనం రేపిన ఘటనలో, దేశాధినేత ‘కిమ్’ జాంగ్ ఉన్ మరోమారు తన కఠిన చర్యలతో ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.
ఇటీవల చాగంగ్ ప్రావిన్స్‌లో వచ్చిన భారీ వరదలు పంట పొలాలను, ఇళ్లను నేలమట్టం చేసి, 4,000 మందికి పైగా ప్రాణాలు కబళించాయి.
వరదల ధాటికి తీవ్ర నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అవ్వడంతో, కిమ్ ఈ విషయంలో చట్టానికి అతీతంగా చర్యలు తీసుకున్నారు.
కిమ్ జాంగ్ ఉన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, వరదల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 30 మంది అధికారులకు ఉరి శిక్ష విధించాలని ఆయన ఆదేశాలు జారీచేశారు.
ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వర్గాలు కథనాలు ప్రచురించాయి. కిమ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది.
చాగంగ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన బాధ్యతను తీసుకోకుండా, ప్రాణనష్టాన్ని అంచనా వేయడంలో విఫలమైన అధికారులపై ఈ విధంగా కఠిన చర్యలు తీసుకోవడం, ఉత్తర కొరియా ప్రభుత్వం తమ నియంతృత్వాన్ని మరోమారు ప్రపంచానికి ప్రదర్శించింది.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి ఇంత తీవ్ర శిక్షలు విధించడం అనేక అనుమానాలు, విమర్శలను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, ఎవరెవరికి ఈ ఉరి శిక్షలు అమలయ్యాయనే వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.