యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎపిక్ యాక్షన్ మూవీ ‘వార్ 2’లో చేస్తున్న పాత్రపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ పంచుకోనున్న ఎన్టీఆర్.. ఈ సినిమాలో మాస్, స్టైల్, ఇంటెన్స్ అన్నీ కలిపిన పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నాడు.
స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఆయనకు ఓ డిఫరెంట్ డిజైన్‌తో కూడిన పాత్రను రూపొందించారని సమాచారం.
తాజా ఇంటర్నల్ బజ్ ప్రకారం.. ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకే ప్రధాన హైలైట్ కానున్నాయట. ప్రత్యేకంగా విదేశాల్లో భారీ సెట్స్ వేసి, హృతిక్ – ఎన్టీఆర్ మద్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ను హాలీవుడ్ స్టైల్‌లో తెరకెక్కిస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్ పేసింగ్ అన్నీ ఇప్పటి వరకూ చూడని విధంగా ఉండనున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ ట్రెయినింగ్‌లో పాల్గొన్నాడని, తన స్టెప్పింగ్, స్టంట్ మూవ్‌మెంట్స్‌పై స్పెషల్‌గా ఫోకస్ చేశాడట.
దర్శకుడు అయాన్ ముఖర్జీ, యాష్ రాజ్ ఫిలింస్ టీం ఈ యాక్షన్‌ను స్పై యూనివర్స్‌లోనే బెస్ట్ మోమెంట్‌గా నిలిపేందుకు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంతవరకూ ఎన్టీఆర్ సినిమాల్లో మాస్ యాక్షన్ డోస్ ఎక్కువగా ఉన్నా, ఈసారి క్లాస్ టచ్ కూడా ఉన్న యాక్షన్ చూస్తామన్నది స్పష్టమవుతోంది. దీనికితోడు హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఆడియెన్స్‌కు బిగ్ హైప్ తెస్తోంది.
వార్ 2 సినిమా ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుండగా.. ఈ ప్రాజెక్ట్‌తో ఎన్టీఆర్ తన నేషనల్ మార్కెట్‌ను మరింత బలంగా నిలబెట్టుకోనున్నాడు.