మూవీడెస్క్: ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవర పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది.
సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ వసూళ్లలో దూసుకుపోతోంది. దసరా సెలవుల ఫెస్టివ్ సీజన్‌ను సద్వినియోగం చేసుకుని కలెక్షన్లలో అదరగొట్టింది.
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి రోజునే దేవర రూ.172 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
వారం రోజుల్లోనే రూ.405 కోట్ల మార్కును దాటిన ఈ సినిమా, 16 రోజుల తర్వాత మొత్తం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.
ఫ్యాన్స్ ఈ ఘనతను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలతో విడుదలైన దేవర ప్రీరిలీజ్ బిజినెస్ లోనే రికార్డులు సృష్టించింది.
ఈ సినిమా, కేవలం 10 రోజుల్లోనే తెలుగు స్టేట్స్‌లో రూ.112 కోట్ల టార్గెట్‌ను అందుకుని ప్రస్తుతం రూ.135 కోట్లను దాటి దూసుకుపోతోంది.
బాలీవుడ్ లో కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా దేవర తన ప్రభావాన్ని చూపించింది.
నార్త్ అమెరికాలో 7 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, యూకేలోనూ భారీ వసూళ్లు సాధించింది.
ఈ విజయవంతమైన రన్ తర్వాత అందరి దృష్టి ఇప్పుడు దేవర పార్ట్-2పై కేంద్రీకృతమైంది.
త్వరలోనే సీక్వెల్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.