మూవీడెస్క్: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ముందుగా ‘డ్రాగన్’ టైటిల్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ, తాజాగా తమిళంలో అదే టైటిల్‌తో మరో సినిమా ప్రారంభం కావడంతో, కొత్త టైటిల్ కోసం దర్శకుడు ఆలోచిస్తున్నారు.
ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
షూటింగ్ ప్రారంభంలో ఎన్టీఆర్ జాయిన్ కాకపోవచ్చని, వచ్చే ఏడాది నుంచి ఆయన పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ‘వార్ 2’ చిత్రంలో హృతిక్ రోషన్‌తో కలిసి యాక్షన్ సీన్స్‌లో బిజీగా ఉన్న తారక్, ఈ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత ప్రశాంత్ నీల్ మూవీకి టైమ్ కేటాయించనున్నారు.
ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ చిత్రానికి ప్రిపరేషన్ మొదలు పెట్టనున్నారు.
2026 జనవరిలో ఎన్టీఆర్ మూవీ రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడతాయనేది ట్రేడ్ వర్గాల టాక్.