మూవీడెస్క్: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నవంబర్ చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం, కానీ ఎన్టీఆర్ జనవరిలో షూట్‌లో జాయిన్ అవుతారని అంచనా.
ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు కేజీఎఫ్ వంటి సినిమాలతో తన సొంత స్టైల్‌లో సక్సెస్ సాధించారు.
అయితే, తన గత చిత్రాల్లో కనిపించిన బ్లాక్ థీమ్ ప్రేక్షకులకు రొటీన్ అనిపించడం వల్ల, ఈసారి నూతన నేపథ్యం, కొత్త విజువల్స్‌తో సినిమా రూపొందించాలని నిర్ణయించుకున్నారు.
ఈ కొత్త ప్రాజెక్ట్‌లో బ్లాక్ థీమ్‌కు బదులుగా కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీనికితోడు, బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ కొనసాగనుందని, అక్కడి తెలుగు వారికి హీరో ఎలా సపోర్ట్ గా నిలిచాడనే ఆసక్తికరమైన అంశంతో కథను అల్లినట్లు సమాచారం.
ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.