మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 31వ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే మేకర్స్ తరచూ ఆసక్తికర అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని పెంచుతున్నారు.
తాజాగా మరో బిగ్ ట్రీట్ ప్రకటించారు. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఇది ఎన్టీఆర్ అభిమానులకు గొప్ప గిఫ్ట్ అని చెప్పాలి. గ్లింప్స్‌తో సినిమా మాస్ రేంజ్ ఎలా ఉండబోతుందో ఫ్యాన్స్‌కు ఐడియా వస్తుంది.
అదే సమయంలో మరో కీలకమైన అప్డేట్ ఇచ్చారు. మొదటిగా సంక్రాంతి 2025 రిలీజ్ అనుకున్న ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసి 2025 జూన్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. వేసవి తర్వాత కొత్త రిలీజ్ స్ట్రాటజీతో బాక్సాఫీస్ దున్నేందుకు రెడీ అవుతున్నారు.
ఈ భారీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రాజెక్ట్‌పై ఉన్న క్రేజ్ బిజినెస్ పరంగా కూడా భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఇలా ఒక్కరోజులోనే గ్లింప్స్ అప్‌డేట్, రిలీజ్ డేట్ షిఫ్ట్ చేస్తూ ఎన్టీఆర్ మూవీపై మరింత హైప్ పెంచేశారు.
ntr31, prashanth neel, ntr birthday glimpse, mythri movie makers, ntr arts,