టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘డ్రాగన్’ టాప్‌లో నిలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
దర్శకుడిగా కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన ప్రశాంత్ నీల్‌కు ఇది ఎన్టీఆర్‌తో మొదటి ప్రాజెక్ట్ కావడం విశేషం.
ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ నెల 22న ఎన్టీఆర్ షూట్‌కి జాయిన్ కాబోతున్నారు. హైదరాబాద్‌లో మూడు వారాల పాటు ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇందులో చిత్రంలోని హైలైట్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారు.
ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా రుక్మిణి నటించనుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా.. టెక్నికల్‌గా గట్టి బృందంతో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్ర కోసం స్పెషల్ ప్రిపరేషన్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది.
వార్ 2తో పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుతున్న ఎన్టీఆర్, దాంతో పాటు బరువు తగ్గి కొత్త లుక్‌లోకి మారినట్టు సమాచారం. ‘డ్రాగన్’ టైటిల్ ఫిక్స్ అయితే, గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్‌లో ఉన్నారు.