యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి హిట్ ఫిల్మ్స్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో సినీ ప్రేమికుల ఆసక్తి పెరిగింది. కథ నార్త్ ఈస్ట్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, యాక్షన్ పార్ట్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండనుందని టాక్.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు డిఫరెంట్ మేకోవర్ అవసరమని, అందుకే ఆయన 14 కేజీలు బరువు తగ్గారని సమాచారం. గతంలో ‘యమదొంగ’ కోసం రాజమౌళి చెప్పినట్లు బరువు తగ్గిన ఎన్టీఆర్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా అదే డెడికేషన్ చూపిస్తున్నారు.
ఫిట్‌నెస్ ట్రైనింగ్, కఠినమైన డైట్ ఫాలో అవుతూ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారు. ఒకటి సింపుల్ లుక్ కాగా, మరొకటి చాలా ఇంటెన్స్ & రఫ్ లుక్ అని తెలుస్తోంది.
హీరో క్యారెక్టర్ డిజైన్ ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ మేనరిజం కలిగిఉంటుందని సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలైందని, ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని టాక్. ప్రస్తుతం మేకర్స్ రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.