టాలీవుడ్: ఇండియన్ రియాలిటీ షోస్ లో బాగా పాపులర్ అయిన షోస్ కేబీసీ(కౌన్ బనేగా కరోడ్పతి) మరియు బిగ్ బాస్. ఈ రెండు రియాలిటీ షోస్ ని రీజనల్ భాషల్లో కూడా రూపొందిస్తున్నారు. కేబీసీ ని మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో తెలుగు లో మా టీవీ లో నాగార్జున మరియు చిరంజీవి హోస్ట్ గా ఇదివరకు ప్రెసెంట్ చేసారు. ఇపుడు ఇదే కార్యక్రమాన్ని తెలుగు లో జెమినీ టీవీ లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా రానున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకే బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొట్టాడు. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ నాలుగు సీజన్ లలో జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ ని బీట్ చేయలేకపోయారనేది వాస్తవం.
జెమినీ టీవీ లో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాం ఆగష్టు 22 న మొదలు కానుంది. అదే రోజు మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడం కూడా విశేషం. ఈ మొదటి ఎపిసోడ్ లో RRR సినిమాలో ఎన్టీఆర్ తో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పార్టిసిపెంట్ గా రానున్నాడు. రామ్ VS రామ్ గా ఈ షో ని ప్రెసెంట్ చేస్తున్నారు జెమినీ టీవీ. ఈ షో కి సంబందించిన టీజర్ ఈ రోజు విడుదల చేసారు. ఫుల్ ఫన్ రైడ్ గా ఈ ప్రోగ్రాం ఉండనున్నట్టు అర్ధం అవుతుంది. ఒక ఫ్రెండ్ హోస్ట్ చేస్తున్న ప్రోగ్రాం కి వచ్చి ఫ్రెండ్ ని ఇరిటేట్ చేసి మంచి ఫన్ జెనెరేట్ చేసారు చరణ్. ఆగష్టు 22 న కన్ను తిప్పుకోలేని ఎక్సయిట్మెంట్ తో ఈ ప్రోగ్రాం చూస్తారు అని జెమినీ టీవీ ఈ టీజర్ ని ప్రెసెంట్ చేసింది.