fbpx
Friday, November 29, 2024
HomeMovie Newsకీర్తి సురేష్ వివాహం.. వచ్చే గెస్టులు ఎంతమంది?

కీర్తి సురేష్ వివాహం.. వచ్చే గెస్టులు ఎంతమంది?

NUMBER-OF-GUESTS-ATTENDING-KEERTHY-SURESH-MARRIAGE
NUMBER-OF-GUESTS-ATTENDING-KEERTHY-SURESH-MARRIAGE

మూవీడెస్క్: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. డిసెంబర్ లో తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తటిల్‌ను వివాహం చేసుకోనున్నారు.

ఈ విషయాన్ని కీర్తి కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. గోవాలో ఓ గ్రాండ్ రిసార్ట్ లో ఈ వేడుక నిర్వహించనున్నారు.

ఈ వివాహం పూర్తిగా ప్రైవేట్‌గా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యనే జరగనుంది.

చాలా కాలంగా కీర్తి సురేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే ఇప్పటివరకు ఆమె కుటుంబం వాటిని ఖండించగా, చివరికి నిజం చెప్పక తప్పలేదు.

పెళ్లి ఏర్పాట్ల కోసం ఇప్పటికే గోవాలో రిసార్ట్ బుక్ చేసినట్లు సమాచారం. కానీ ఈ వేడుకకు కొద్దిమంది మాత్రమే ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని పెళ్లికి హాజరవుతారని టాక్ వినిపిస్తోంది.

చిరంజీవి, కీర్తి తల్లి మేనక మధ్య మంచి స్నేహబంధం ఉంది. 1980లో వచ్చిన పున్నమి నాగు సినిమాలో చిరు, మేనకా కలిసి నటించారు.

ఇదే బంధం కీర్తి సురేష్‌తో చిరంజీవి నటించిన భోళా శంకర్లో కొనసాగింది. ఇక నాని, కీర్తి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నేను లోకల్, దసరాలో ఈ జంట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

కోలీవుడ్ నుంచి విజయ్, అట్లీ వంటి ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ చిత్రంతో కీర్తి అడుగుపెడుతున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలకానుంది.

తమిళంలో రివాల్వర్ రీటాతో సహా నాలుగు సినిమాలు చేయనున్న కీర్తి, ఈ వివాహం అనంతరం కెరీర్‌లో కొత్త ఆరంభం చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular