టాలీవుడ్: ఈ ఏడాది ఆరంభం లో ఫిబ్రవరి లో ‘చెక్’ , మార్చ్ లో ‘రంగ్ దే’ రెండు సినిమాలు విడుదల చేసిన నితిన్ మరో సినిమాని సిద్ధం చేసారు. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా హీరో గా రూపొంది సూపర్ హిట్ అయిన ‘అందాదున్’ సినిమాని తెలుగులో ‘మేస్ట్రో’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. ఈ మధ్యనే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉన్న ఈ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. సరైన టైం చూసుకుని వీలైతే థియేటర్ లేదంటే ఓటీటీ లో విడుదల చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ లో భాగం గా మ్యూజిక్ తో మొదలుపెట్టింది సినిమా టీమ్.
ఈ సినిమాలో ‘ఓహ్ బేబీ ఓహ్ బేబీ’ అంటూ సాగే పాటని ఇవాల విడుదల చేసారు. ఈ సినిమాలో నితిన్ ఒక అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఒక కాఫీ షాప్ లో పాటలు పాడి డబ్బులు సంపాదిస్తూ అది చూసి ఎవరైనా మూవీ ఆఫర్ ఇవ్వ పోతారా అనే కథలో భాగం గా ఈ పాట వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నభ నటేష్ నటిస్తుంది. పాటలో చూపించిన విజువల్స్ లో గోవా లో హీరో కి హీరోయిన్ కి మధ్య జరిగే సీన్స్ ని చూపించారు. ఓహ్ బేబీ ఓహ్ బేబీ పాటతో మరో కాచీ నెంబర్ తో హిట్ కొట్టాడు మహతి స్వర సాగర్. భీష్మ తో నితిన్ కి పని చేసిన మహతి సాగర్ ఈ సినిమాతో రెండో సారి నితిన్ తో పని చేసారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో నికిత రెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.