లాస్‌ఎంజిల్స్: నాసా అంగారక గ్రహంపై పరిశోధనల నిమిత్తం ప్రయోగించిన పర్సెవరన్స్ రోవర్ దిగిన స్థలానికి నాసా ఒక పేరును పెట్టింది. నాసా తన పర్సెవరన్స్ రోవర్ దిగిన స్థలానికి ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత ‘ఆక్టేవియా ఇ బట్లర్ ’ పేరును పెట్టారు.
అంగారక గ్రహం పైకి పంపిన పర్సెవరెన్స్ అక్కడి రాళ్లు మరియు మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, నేరుగా మానవుడు ఎక్కడ ల్యాండ్ అవ్వడానికి అనువైన స్థలాన్ని వెతకడం అనేది పర్సెవరన్స్ యొక్క విధి.
ఇంతకు ముందు మార్స్‌పై దిగిన నాసా యొక్క క్యూరియాసిటి రోవర్ ల్యాండింగ్ స్థలానికి ‘రే బ్రాడ్‌బరీ’ రచయిత పేరును 2012 ఆగస్టు 22న పెట్టారు. గత ఏడాది జూలై 30 న ఈ రోవర్‌ను నాసా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇది 203 రోజుల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18 న అంగారక గ్రహానికి చేరుకుంది.