పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ OGపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డైరెక్టర్ సుజీత్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
సమాచారం ప్రకారం OGలో పవన్ కళ్యాణ్‌ను యంగ్ లుక్‌లో చూపించేందుకు సుజీత్ స్పెషల్ ప్లాన్ చేశాడు. ఈ లుక్ కోసం కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీని వాడుతున్నట్టు తెలుస్తోంది. 30 ఏళ్ల వయసులో ఉన్న పవన్ లుక్‌ను రీ-క్రియేట్ చేయడానికి డిజిటల్‌గా స్పెషల్ వర్క్ చేయనున్నారు.
ఈ కాన్సెప్ట్‌తో రూపొందే యాక్షన్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుందని సమాచారం. ఖుషి, తమ్ముడు టైం పవన్‌ను మళ్లీ తెరపై చూసే అవకాశం రావడంతో ఫ్యాన్స్ క్రేజీగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ ప్లాన్‌తో OG ఒక సాంకేతిక అద్భుతంగా మారబోతోంది.
ఈ మూవీకి థమన్ మ్యూజిక్, హై రిచ్ విజువల్స్, డబ్బింగ్ వర్క్ కూడా శరవేగంగా పూర్తవుతోంది. మేకర్స్ త్వరలోనే మరో మాస్ టీజర్ రిలీజ్ చేయనున్నట్టు టాక్. పవన్ యువ లుక్ OGకి హైపునే కాదు, హిట్ గ్యారంటీ కూడా ఇస్తుందనే నమ్మకం బలంగా ఉంది.