టాలీవుడ్: తెలుగు ఒరిజినల్ కంటెంట్ తో వరుస గా సినిమాలు , సిరీస్ లు రూపొందిస్తూ కంటెంట్ పరంగా దూసుకెళ్తుంది ఆహా ఓటీటీ. తమిళ్, మలయాళ హిట్ సినిమాలు డబ్ చేస్తుండడం తో పాటు డైరెక్ట్ సిరీస్ లు, సినిమాలు రూపొందించి ఓటీటీ లో విడుదల చేస్తుంది. అమలా పాల్ తో ‘కుడి ఎడమైతే‘ అనే సిరీస్ తో పాటు ‘ఒక చిన్న విరామం’ అనే మరో సిరీస్ ని కూడా రూపొందించారు. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సిరీస్ రూపొందింది.
బిసినెస్ మాన్ గా ఉండే హీరో నష్టాల్ని ఫేస్ చేయాల్సి వచ్చినపుడు వాటి నుండి బయట పడాలని మార్గం వెతుకుతుండగా ఫుడ్ అడిక్ట్ అనే డ్రగ్ అతని దృష్టికి వస్తుంది. మరి ఆ డ్రగ్ అతను తన బిజినెస్ లో వాడాడా? వాడాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు లాంటి సీన్స్ తో ట్రైలర్ చూపించారు. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో పాటు కామెడీ, లవ్ స్టోరీ లాంటి ఎలిమెంట్స్ ని కూడా టచ్ చేస్తినట్టు అర్ధం అవుతుంది.
సందీప్ చేగూరి అనే దర్శకుడు ఈ సిరీస్ ని రూపొందించాడు. ఈ సిరీస్ లో సంజయ్ వర్మ, నవీన్ నేని, పునర్నవి భూపాళం, గరిమ సింగ్ నటించారు. జులై 9 నుండి ఈ సిరీస్ ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది.