ముంబై: ఈ నెల 26వ తేదీ నుండి పారిస్ లో ప్రారంభం అవనున్న ఒలంపిక్స్-2024 ను జియో సినిమాలో ఉచితంగ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జియో తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ పారిస్ ఒలంపిక్స్-2024 ను ఉచితంగా చూడవచ్చు. దీంతో జియో సినిమా తన వ్యూస్ ను భారీగా పెంచుకోవడానికి ఉపయోగపడనుండి. కాగా జియో తన వ్యూస్ ను 150 మిలియన్స్ కు పెరుగుతాయని అంచనా వేస్తోంది.
ఒలంపిక్స్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇంకా స్పోర్ట్స్ 18 నెట్వర్క్ లో కూడా వీక్షించవచ్చు. భారత కాల మానం ప్రకారం ఉదయం 11 గంటలకు గేమ్స్ ప్రత్యక్ష ప్రసారం మొదలవుతాయి.