ఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లు మరోసారి దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే ప్రతిపాదనతో కేంద్రం ఈ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో రూపొందించిన నివేదిక ఆధారంగా ఈ బిల్లుకు రూపకల్పన జరిగింది.
బిల్లుకు మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైనప్పటికీ, కేంద్రానికి తగిన సంఖ్యాబలం లేకపోవడం ప్రధాన ఆటంకంగా మారింది.
వేరే దశలో పార్లమెంట్ జాయింట్ కమిటీకి పంపి, విస్తృత చర్చల ద్వారా బిల్లును ముందుకు తీసుకెళ్లే యోచనలో ఉంది.
బిల్లుపై బీఎస్పీ మద్దతు తెలపగా, ఇండియా కూటమి, కాంగ్రెస్ వంటి విపక్ష పార్టీలు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై విభిన్న అభిప్రాయాలు ఉండడంతో, ఈ చర్చకు సంబంధించి కేంద్రం తీసుకునే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.