హైదరాబాద్: జూన్ 21 2019 , సరిగ్గా ఒక సంవత్సరం క్రితం చిన్న సినిమాగా విడుదల అయ్యి టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించిన సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‘. ఇవాల్టికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భం గా ఆ సినిమా ని నిర్మించిన స్వధర్మ సంస్థ అధినేత రాహుల్ యాదవ్ నక్క ఒక నోట్ ని రిలీజ్ చేశారు.
మంచి సినిమాలకి కావాల్సినవి మంచి కథలు కానీ పెద్ద స్టార్స్ కాదు, ఇండస్ట్రీ లో చిన్న వాళ్ళతో తీసిన సినిమా అయిన పెద్ద విజయం అని చెప్పుకొచ్చారు. చిన్న సినిమాలని చిన్న చూపు చూసే వాళ్లందరికీ ఇదోక చెంపపెట్టు అని చెప్పారు అలాగే మంచి కథా బలం ఉన్నా సినిమాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు.
ఈ సినిమా విడుదల అవకముందు ఇది ఆడదు, జనాలకి సినిమా అర్ధం అవదు అలాగే సినిమాలో ఉన్నా ఒక్క ముఖం కూడా జనాలకి తెలియదు. సినిమాకి ఎవరిని చూసి వస్తారు , ఈ సినిమాకి 6 థియేటర్స్ ఏ ఎక్కువ , మహా అయితే 3 రోజులు ఆడడం గొప్ప విషయం అని అపహాస్యం చేశారు కానీ 50 రోజుల కన్నా ఎక్కువ థెట్రికల్ రన్ తో అందరి నోళ్లు మూయించిందని చిన్న సినిమా కి పెద్ద విజయం లభించిందని చెప్పారు. అంతే కాకుండా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా మోస్ట్ రేటెడ్ తెలుగు సినిమాగా టాప్ పోసిషన్ లో కూడా ఉంది.