fbpx
Monday, March 31, 2025
HomeAndhra Pradeshఒంగోలు వైసీపీకి షాక్: జనసేనలోకి కీలక నేతలు

ఒంగోలు వైసీపీకి షాక్: జనసేనలోకి కీలక నేతలు

ongole-ysrcp-leaders-join-janasena

ఏపీ: వైసీపీకి ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ షాక్ తగిలింది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లోకి ఎన్నికైన 20 మంది వైసీపీ కార్పొరేటర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరబోతున్నారు. 

ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో వీరంతా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ మార్పు వెనుక ప్రధాన కారణం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలినేని ఆధ్వర్యంలో ఈ కార్పొరేటర్లు కూడా తన వెంట నడుస్తామని తెలిపారు.

వైసీపీ శ్రేణుల్లో ఈ పరిణామం తీవ్ర అసంతృప్తిని రేపుతోంది. ముఖ్యంగా ఒంగోలు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన బలంగా ఎదుగుతోందని, ఆ పార్టీ వైపు మరిన్ని నేతలు చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular