fbpx
Sunday, January 19, 2025
HomeNationalసరికొత్త ఫీచర్ తో ఆరోగ్య సేతు యాప్

సరికొత్త ఫీచర్ తో ఆరోగ్య సేతు యాప్

OPEN-API-FEATURE-AROGYA-SETU-APP

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్త పడేందుకు సాయం చేసే కోవిడ్‌ ట్రేసింగ్‌ యాప్‌ ‘ఆరోగ్య సేతు’లో కొత్త ఫీచర్ ను కేంద్ర ప్రభుత్వం‌ ప్రవేశపెట్టింది. కోవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో వ్యాపార సంస్థల కార్యకలాపాలు సులభతరం చేసేలా ‘‘ఓపెన్‌ ఏపీఐ సర్వీస్‌’’ను కొత్తగా తీసుకువచ్చింది.

దీని ద్వారా వ్యాపార సంస్థలు, తమ ఉద్యోగులు, ఈ యాప్‌ను ఉపయోగించే ఇతర యూజర్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేఒదుకు వీలు కల్పించింది. అయితే ఇందుకు సదరు యూజర్ల అంగీకారం తీసుకోవడం తప్పనిసరి అని, దీని ద్వారా ఆరోగ్య సేతు యాప్‌ యూజర్ల డేటా, గోప్యతకు ఎలాంటి భంగం కలగబోదని స్పష్టం చేసింది.

అలాగే ఇందులో కేవలం ఆరోగ్య సేతు స్టేటస్‌, యూజర్‌ పేరు తప్ప మరే ఇతర వివరాలు ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ , ఐటీ మంత్రిత్వ శాఖ ఈ రోజు (శనివారం) ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రాణాంతక కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 30 వేల పాజిటివ్‌ కేసులను ట్రేస్‌ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో కరోనా బాధితులను గుర్తించడంతో పాటు వారిని అప్రమత్తం చేసి తగిన చికిత్స అందించడం ఆరోగ్య కార్యకర్తలకు తేలికైంది. ఇక ఆరోగ్య సేతు యాప్‌నకు సుమారు 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ ఆరోగ్య సేతు ప‌్ర‌పంచంలోనే అధిక డౌన్‌లోడ్లు చేసుకున్న కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ గా రికార్డు సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular