హైదరాబాద్: ఒకప్పుడు అంటే కరోనా కి ముందు ఒక సినిమా విడుదల అవుతుంది అంటే ట్రైలర్ రిలీజ్ అని, ఆడియో రిలీజ్ అని, ప్రీ రిలీజ్ అని, సక్సెస్ ఈవెంట్ అని, సక్సెస్ టూర్ అని ఇలా రకరకాల వేడుకలు ఒక సినిమాకి సంబందించినవి ఉండేవి. కానీ కరోనా వల్ల అన్నీ ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. సినిమా ఓటీటీ లో విడుదల అవుతున్నా కూడా ‘ఒరేయ్ బుజ్జిగా’ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇవాళ హైదరాబాద్ లో జరిపింది. సోషల్ డిస్టెన్సిన్గ్ ని పాటిస్తూ చాలా తక్కువ మందితో ఈ వేడుకని నిర్వహించింది.
రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలుగా వస్తున్నా ఈ సినిమాని ‘గుండె జారీ గల్లంతయిందే’ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వచించారు. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుండి ‘ఆహా’ ఓటీటీ లో అందుబాటులో ఉంచబోతున్నట్టు ముందుగానే చెప్పారు. కానీ ఈ సినిమాని అక్టోబర్ 1 సాయంత్రం 6 నుండే అందుబాటులో ఉంచబోతున్నట్టు సడన్ సర్ప్రైస్ ఇచ్చారు మేకర్స్. మూడు రోజులు సెలవు కావడం తో వీకెండ్ మూడ్ లో వ్యూస్ ఎక్కువ వస్తాయని మేకర్స్ ఈ ప్లాన్ చేసినట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ హైలైట్ గా నిలవబోతుంది.