టాలీవుడ్: తెలుగు సినిమాల్లో విలన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు రాజనాల, రావు గోపాల్ రావు ఆ తర్వాత కాలంలో నీల కంఠ. ఆ తర్వాత పర బాషా విలన్లు ఎక్కువగా వచ్చి ఇక్కడ విలన్లుగా చాలా ఏళ్ళు సినిమాలు చేసారు. ఈ జాబితా లోకి ముఖేశ్ ఋషి, ఆశిష్ విద్యార్ధి, సోనూ సూద్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే తో పాటు ఇంకొంత మంది ఉన్నారు. ఇప్పుడు కూడా పర బాషా నటులు, విలన్లు తెలుగులో విలన్లుగా చేస్తున్నారు కానీ ఎక్కువ సినిమాలు కానీ ఎక్కువ రోజులు కానీ ఇక్కడ స్టాండ్ అవలేకపోతున్నారు.
ఇప్పుడు ఇండస్ట్రీ లో విలన్లుగా రావు రమేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు లాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా విలన్లుగా తెలుగు సినిమాల్లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. వేరే కొంత మంది నటులు విలన్లు గ వచ్చిన కూడా ఇక్కడ ఎక్కువ కాలం నిలపడలేకపోతున్నారు.
ధృవ సినిమా ద్వారా అరవింద స్వామి, వినయ విధేయ రామ సినిమా ద్వారా ‘వివేక్ ఒబెరాయ్’, స్పైడర్ సినిమా ద్వారా ‘ఎస్.జ్.సూర్య’, బ్రూస్ లీ సినిమా ద్వారా ‘అరుణ్ విజయ్’ , ఖైదీ 150 సినిమా ద్వారా తరుణ్ అరోరా వీరితో పటు రవి కిషన్ , అశుతోష్ రానా ఇలా విలనిజం ని పండించిన కానీ ఎందుకో ఎక్కువ సినిమాల్లో కనిపించట్లేదు. వీళ్ళు నటించిన ఆయా సినిమాల్లో విలనిజం అంటే ఇలా ఉండాలి అని స్టాండర్డ్స్ క్రియేట్ చేసిన వీళ్ళు తర్వాత సినిమల్లో ఎక్కువ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.