టాలీవుడ్: బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ సినిమాల రూపు రేఖలు మారాయి. ఇక్కడ విడుదలవుతున్న ప్రతీ సినిమా పైన అందరి దృష్టి ఉంది. ఏదైనా మంచి సినిమా విడుదల అవగానే రీమేక్ రైట్స్ కోసం వేరే బాషల నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వేరే భాషల్లో ఉన్న టాప్ దర్శకులు కూడా మన మార్కెట్ పైన కన్నేసి మన హీరో లతో సినిమాలు తీస్తున్నారు. అప్పుడప్పుడు వేరే బాషల హీరోలు కూడా డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు.
ఇప్పుడు వున్న డైరెక్టర్లలో టాప్ లీగ్ లో ఉన్న డైరెక్టర్ శంకర్. దాదాపు మూడు దశాబ్దాలుగా తమిళ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుని తన సినిమా వస్తుందంటే అందరూ ఎదురు చూసే స్టేజ్ కి వచ్చిన డైరెక్టర్ శంకర్. ఈ డైరెక్టర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేసాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. కే.జి.ఎఫ్ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ డైరెక్టర్ తెలుగు లో ప్రభాస్ తో మరియు ఎన్ఠీఆర్ లతో సినిమాలు లైన్ లో పెట్టి వరుసగా తెలుగు నుండి పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టాడు.
వీరు మాత్రమే కాకుండా మణి రత్నం కూడా గీతాంజలి తర్వాత తెలుగు లో సినిమాలు తీసే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇప్పటి వరకు కుదరలేదు. ‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాల దర్శకుడు లోకేష్ కానగరాజ్ కూడా తెలుగులో సినిమాలు తియ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరో తమిళ దర్శకుడు లింగుస్వామి రామ్ పోతినేని తో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేసాడు. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ , కాంబినేషన్స్ సెట్ అయ్యి త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.