మూవీడెస్క్: కరోనా పాండమిక్ సమయంలో దేశంలో ఓటీటీ లకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
కరోనా ముందు వరకు తక్కువ ఆదరణలో ఉన్న ఓటీటీలు, లాక్‌డౌన్ కాలంలో సినిమాలు, సిరీస్‌లు చూసేందుకు ప్రధానమైన వేదికలుగా మారాయి.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, హాట్‌స్టార్ వంటి అనేక ఓటీటీలు విపరీతమైన పాపులారిటీ సంపాదించాయి.
ఈ క్రేజ్ కారణంగా, ఓటీటీ సంస్థలు పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేసి, స్ట్రీమింగ్ చేసేవి. మరికొన్ని ప్రత్యేకంగా నిర్మించాయి.
కానీ తాజాగా ఓటీటీలు డీల్స్ విషయంలో మార్పు తీసుకొచ్చాయి. ఇప్పుడు అన్ని సినిమాలను కొనుగోలు చేయడం లేదని స్పష్టమవుతోంది.
ఎక్కువగా పే పర్ వ్యూ (ప్రతీ వ్యూకి చెల్లింపు) పద్ధతిన సినిమాలను స్ట్రీమింగ్ చేయడంపై ఫోకస్ పెట్టాయి.
ఇది ఓటీటీ సంస్థలకు లాభదాయకమైన విధానం. కానీ, రిస్పాన్స్ లేనప్పుడు, నిర్మాతలకు తీవ్ర నష్టం వస్తోంది.
ప్రస్తుతం బడా హీరోల సినిమాలకే ఓటీటీలు భారీ మొత్తాలు వెచ్చిస్తున్నాయి. అయితే మీడియం, చిన్న హీరోల చిత్రాలను కేవలం పే పర్ వ్యూ మోడల్‌లోనే తీసుకోవాలని చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మేకర్స్ తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఓటీటీలపై పూర్తిగా ఆధారపడకుండా, థియేట్రికల్ రన్‌ను మెరుగుపరచేలా ప్లాన్ చేసుకోవడం మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.
రాబోయే రోజుల్లో మేకర్స్ మరింత జాగ్రత్తగా ముందుకు సాగితేనే విజయాన్ని సాధించగలరని చెబుతున్నారు.