హైదరాబాద్: థియేటర్లు తెరచుకున్నా కూడా ఓటీటీ రిలీజ్ లు మాత్రం ఆగట్లేదు. ఇప్పటిదాకా చిన్న సినిమాలు విడుదలయ్యాయి కానీ ఈ వారం కొన్ని హై బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఇండిపెండెన్స్ డే సందర్గంగా రెండు ఇండియన్ ఆర్మీ హిస్టారికల్ వార్ బేస్డ్ బాలీవుడ్ మూవీస్ కూడా విడుదలవుతున్నాయి .
ఓటీటీ రిలీజ్ లు ఎక్కువగా ఉన్న మళయాళం ఇండస్ట్రీ నుండి ఈ రోజు ‘కురుతి’ అనే సినిమా విడుదలైంది. పృథ్విరాజ్ సుకుమారన్, రోషన్ మాత్యు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈరోజే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా ఒక కొత్తరకమైన కథనం తో ఉన్నట్టు టాక్ నడుస్తుంది.
తమిళ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్న నయనతార ముఖ్య పాత్రలో నటించిన ‘నేత్రికాన్’ మూవీ ఈ నెల 13 న హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల అవుతుంది. ఈ సినిమాలో దృష్టి లోపం ఉన్న ఛాలెంజింగ్ పాత్రలో నయనతార నటిస్తుంది. తన ముందు జరిగిన ఒక క్రైమ్ ని కళ్ళు కనిపించని పాత్రలో నయనతార ఎలా చేదించిందనే కథాంశం తో ఈ సినిమా రూపొందింది.
1998 లో జరిగిన కార్గిల్ వార్ నేపధ్యం లో రూపొందిన సినిమా ‘షేర్ షా’. ఆ యుద్ధం లో పాల్గొన్న విక్రమ్ బాత్రా బయోపిక్ గా ఈ సినిమా రూపొందింది. విక్రమ్ బాత్రా కోడ్ వర్డ్ ‘షేర్ షా’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందింది. షేర్ షా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా నటిస్తున్నాడు. మరో ముఖ్య పాత్రలో కియారా అద్వానీ నటిస్తున్నారు. పూర్తి ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులని వార్ జోన్ లోకే తీసుకెళ్లే మూవీ గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా ఆగష్టు 12 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవనుంది.
1970 లో గుజరాత్ లోని భుజ్ అనే ప్రదేశం లో నేవీ స్థావరం పై పాకిస్థాన్ రాకెట్స్ దాడి చేసిన సమయంలో అక్కడ ఉన్న కెప్టెన్ ఆ యుద్దాన్ని ఎలా హ్యాండిల్ చేసాడు అనే విషయాన్ని ‘భుజ్’ అనే టైటిల్ తో రూపొందించారు. పాకిస్థాన్ రాకెట్స్ దాడిలో రన్ వే పూర్తిగా చెడిపోవడం తో అక్కడి గ్రామ ప్రజల సహాయం తో రన్ వే ని పునరుద్ధరించి పాకిస్తాన్ వాళ్ళకి ఎదురు సమాధానం ఎలా ఇచ్చాడు లాంటి ఇంటెన్స్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, ప్రణీత, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 13 న హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల అవుతుంది
పోయిన వారం ఎన్నో అంచనాలతో విడుదలైన ‘నవ రస’ అంచనాల్ని నిలుపుకోలేకపోయింది. మరి ఈ వారం ఓటీటీ రిలీజ్ లు మంచి టాక్ తో ఆకట్టుకోవాలని ఆశిద్దాం.