ఓటీటీ, గత రెండు మూడు నెలలుగా అందరి నోళ్ళల్లో నానుతున్న పదం. కొందరు అనొచ్చు ఏముందిరా మనం ఇంట్లోనే కూర్చొని అన్ని సినిమాలు చూసెయ్యొచ్చు, కానీ వాస్తవం అందుకు భిన్నం. సినిమాలు ఓటీటీల్లో విడుదల అయితే కొద్దీ రోజుల్లో సినిమా మనుగడే మారిపోతుంది.
ఉదాహారణకి మనం థియేటర్ కి వెళ్తే అక్కడ మనకి రెండున్నర గంటలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సినిమాలో లీనం అయ్యే అవకాశం ఉంది అదే ఓటీటీలో ఇంట్లో కూర్చొని చూస్తే పది బ్రేకులు ఇరవై పాజులు లా ఉంటుంది. సినిమాలో లీనం అయిపోయే అవకాశం సగం శాతం పోయినట్టే. అలా అని అందరికి ఇలాగే ఉంటుంది అని చెప్పలేము కానీ ఎక్కువ శాతం జరిగేది ఇదే. ఒక సినిమాని మంచిగా ఎంజాయ్ చెయ్యాలి అన్న అందులో ఉన్న టెక్నికల్ బ్రిలియన్స్ని ఆస్వాదించాలన్న
ఓటీటీ కన్నా థియేటర్ ఏ మిన్న.
మనం ఓటీటీ లో చూస్తే ఖర్చు తక్కువ కావచ్చు కానీ మనకు లభించే వినోదం కూడా తక్కువే.
ఓటీటీ కొన్ని కొత్త అవకాశాలని కొన్ని కొత్త టాలెంట్ని ఆవిష్కరించవచ్చు, థియేటర్లు ఉన్నా లేకపోయినా ఆ అవకాశాలు ఆవిష్కరణలకు కొదవ ఉండదు కానీ థియేటర్లు లేకపోతే చాలా కుటుంబాలు రోడ్డున పడిపోయే పరిస్థితి ఉంది.
కారణం ఏదైనా నా సినిమా ఓటీటీల్లో బలి అవ్వకూడదని ప్రార్థిస్తూ — ఒక పిచ్చి సినిమా అభిమాని