టాలీవుడ్: కరోనా వచ్చిన తర్వాత చాలా థియేటర్లు మూత పడడం తో జనాలు ఓటీటీ ని ఆదరిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న సినిమాలు, విడుదలకి సిద్ధం గా ఉన్న కొన్ని సినిమాలు, వేరే బాషా సినిమాలు డబ్ చేసి విడుదల చేయడంతో పాటు ఓటీటీ కోసమే కొన్ని సినిమాలు సిరీస్ లు రూపొందించి విడుదల చేస్తున్నారు. ఈ క్రమం లో ఈ నెలలో విడుదలకి సిద్ధం అయిన ఓటీటీ కంటెంట్ చూద్దాం.
ఈ నెలలో తమిళ స్టార్ హీరో ధనూష్ నటించిన ‘జగమే తంత్రం‘ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో విడుదల అవనుంది. చాలా రోజులు థియేటర్ రిలీజ్ లేక ఓటీటీ రిలీజ్ అని ఆగిపోయిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 18 న ఓటీటీ లో విడుదల అవుతుంది. రజినీకాంత్ తో ‘పేట’ సినిమాని రూపొందించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. తెలుగు లో ‘అర్ద శతాబ్దం’ అనే సోషల్ డ్రామా మూవీ ఈ నెల 11 న ఆహా ఓటీటీ లో విడుదల అవనుంది. అందరూ కొత్త వాళ్ళు, తక్కువ సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న టీమ్ తో ఈ సినిమా రూపొందించబడింది.
టొవినో థామస్ హీరోగా నటించిన ‘కాలా’ అనే మలయాళీ సినిమాని జూన్ 4 న అదే పేరుతో డబ్ చేసి ఆహా ఓటీటీ లో విడుదల చేయనున్నారు. ప్రియదర్శి నటించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని ఈ నెల 18 న ఆహా ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. వీటితో పాటు అమెజాన్ లో సూపర్ హిట్ అయిన ‘ఫామిలీ మాన్’ సిరీస్ కి సీక్వెల్ అయిన ‘ఫామిలీ మాన్ 2 ‘ సిరీస్ ని జూన్ 4 న విడుదల చేయనున్నారు. ఇలా ఈ నెలలో కంటెంట్ పరంగా కొన్ని మంచి సినిమాలు , సిరీస్ లు విడుదల అవుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఇంకా కొంత కంటెంట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.