మూవీడెస్క్: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన అవార్డు. మెగాస్టార్, ఈ ఏడాది వరుసగా ప్రముఖ అవార్డులు అందుకుంటున్నారు.
ఇటీవల గిన్నిస్ బుక్‌లో రికార్డ్ సాధించిన ఆయన, ఇప్పుడు మరో ప్రెస్టిజియస్ అవార్డును అందుకున్నారు.
24వ ఐఫా అవార్డుల వేడుకలో చిరంజీవికి “అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ 2024” అవార్డు ప్రదానం చేశారు.
అబుదాబీలో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ వెటరన్ షబానా అజ్మీ, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ చేతుల మీదుగా చిరంజీవికి అవార్డు అందించారు.
అవార్డును స్వీకరించిన చిరంజీవి, తెలుగు సినీ పరిశ్రమ, అభిమానుల ప్రేమ, ప్రోత్సాహం వల్లనే ఈ అచీవ్‌మెంట్ సాధ్యమైందని భావోద్వేగంతో అన్నారు.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ చిరంజీవిని హగ్ చేసి అభినందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి మధ్య అనుబంధాన్ని మరోసారి స్టేజ్ పైన చూసి అభిమానులు ఆనందపడ్డారు.
విక్టరీ వెంకటేష్ సహా పలువురు ప్రముఖులు చిరంజీవిని అభినందించారు.
సోషల్ మీడియాలో బాలయ్య-చిరంజీవి కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతుండగా, చిరంజీవి ఇతర సెలబ్రిటీలతో దిగిన సెల్ఫీలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.