మూవీడెస్క్: కాంచన 4: తమిళ బిగ్ బాస్ సీజన్ 1తో పాపులర్ అయిన ఓవియా మరోసారి వార్తల్లో నిలుస్తోంది.
గతంలోనే కొన్ని సౌత్ భాషల చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా స్టార్ హోదా దక్కలేదు.
అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఓవియాపై ట్రెండ్ అవుతున్న పలు అంశాలు ఆమెకు కొత్త అవకాశాలకు దారి తెరుస్తున్నట్లు కనిపిస్తోంది.
తాజాగా రాఘవ లారెన్స్ పాపులర్ హారర్ ఫ్రాంచైజ్ “కాంచన 4” గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
లారెన్స్ ఈ సీక్వెల్‌ను స్వయంగా దర్శకత్వం వహించబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఓవియా కీలక పాత్రలో కనిపించబోతుందని టాక్ ఉంది.
గతంలో “కాంచన 3” సినిమా సమయంలో లారెన్స్-ఓవియా కలసి పనిచేశారు.
ఆ క్రమంలో ఆ సినిమా షూటింగ్ నుంచి ఒక ఫోటోను లారెన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం తాజాగా వైరల్ అయింది.
ఈ ఫోటోతోనే ఆమెను “కాంచన 4” కోసం ఎంచుకున్నారని చర్చలు మొదలయ్యాయి.
లారెన్స్ ఫ్రాంచైజ్‌పై ఉన్న క్రేజ్, హైప్ నేపథ్యంలో ఓవియా పాత్ర ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఓవియాకు ఈ ప్రాజెక్ట్ ఓ పెద్ద బ్రేక్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఓవియా రెండు తమిళ చిత్రాల్లో నటిస్తుండగా, వాటిలో ఒకటి “సంభవం” సినిమాగా 2025లో విడుదల కానుందని టాక్.