టాలీవుడ్: ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్, సోషల్ నెట్వర్క్ తో బ్లడ్ డోనార్స్ లిస్ట్, బ్లడ్ డోనార్స్ డేటాబేస్ నిమిషాల్లో అందుబాటులో ఉంటుంది. కానీ ఇవేవి లేనపుడు ఇంకా రెడ్ క్రాస్ కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ కానీ రోజుల్లో మెగా స్టార్ చిరంజీవి ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ అనే ఒక స్వచ్చంద సంస్థ స్థాపించి నేత్రదానం మరియు రక్త దాన శిబిరాలని నిర్వహించి వాటి ద్వారా వచ్చిన బ్లడ్ యూనిట్స్ ని అవసరం ఉన్న వాల్లకి చేరవేసేలా ఉండేది. 1998 లో స్థాపించిన ఈ సంస్థ నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. మెగా హీరోల బర్త్ డే లకి ఫాన్స్ అందరూ ఇక్కడకి వచ్చి రక్త దానం చేస్తుంటారు.
ఇప్పుడు దేశం లో ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకుని చిరంజీవి గారు ‘ఆక్సీజన్ బ్యాంకు’ ని స్థాపించడానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ప్రతి జిల్లాలో ఒక కేంద్రం ఉండేట్లు చూసుకుంటున్నారు. అంతే కాకుండా ఒక వారం లోనే ఇది ప్రతీ జిల్లాలో అందుబాటులో ఉండేటు కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురు కావద్దని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మెగా స్టార్.