టాలీవుడ్: 90 ల్లో అత్యంత క్లిష్టంగా ఉన్న రక్తం అందుబాటులో లేని పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా రక్త దాన శిబిరాలు నిర్వహించి అక్కడి నుండి వచ్చిన రక్తాన్ని అవసరం ఉన్న వారికి చేరవేసేవారు. ఆ తర్వాత నేత్రదానం కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఆక్సీజన్ కొరతని దృష్టిలో ఉంచుకుని ఆక్సీజన్ బ్యాంకు మొదలుపెట్టనున్నారని మొన్నే ప్రకటించారు. దీన్ని అన్ని జిల్లాలోకి అందుబాటులోకి తెస్తానని కూడా ప్రకటించారు. చెప్పినట్టు గానే ఈరోజు ఆక్సీజన్ బ్యాంకు కార్యక్రమం మొదలుపెట్టారు.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజు ఆక్సీజన్ సీలిండర్లని అనంతపురం, గుంటూరు జిల్లాల్లో మొదలు పెట్టారు. రేపు ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాలోకి అందుబాటులోకి రానుందని ట్వీట్ చేసారు. దీంతో పాటు ఒక మిషన్ ప్రారంభం అయిందని ఇప్పటినుండి ఆక్సీజన్ అందకుండా ఎవరూ మరణించకూడదు అని ట్వీట్ చేసారు చిరంజీవి. చిరంజీవి మాత్రమే కాకుండా ఈ కష్ట కాలంలో సినీ ఇండస్ట్రీ నుండి ఎంతో మంది ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సోనూ సూద్ ఐతే సోనూ సూద్ ఫౌండేషన్ స్థాపించి నిరంతర సేవలు చేస్తున్నారు. టాలీవుడ్ యువ హీరో నిఖిల్ కూడా స్వయంగా మెడిసిన్ అవసరం ఉన్నవాళ్ళకి కార్ లో వెళ్లి చేరవేస్తున్నారు.